వ‌రంగ‌ల్‌లో హైద‌రాబాద్ ప‌బ్లిక్‌స్కూల్‌?

Garikapati Rajesh

వ‌రంగ‌ల్ కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ రానుంది. హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయ‌బోతున్నారు. దీనికోసం ప్ర‌భుత్వం ధ‌ర్మాసాగ‌ర్ మండ‌లం ఎలుకుర్తిలో 50 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కేటాయించ‌గా సంస్థ మార్కెట్ ధ‌ర చెల్లించింది. హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీ వైస్‌చైర్మ‌న్‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు స్థ‌లానికి సంబంధించిన కాగితాలు అంద‌జేశారు. ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ వ‌రంగ‌ల్‌కు రావ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి కేంద్ర‌పాలిత ప్రాంతంగా చేయాల‌నే యోచ‌న‌లో కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కార్ ఉందంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న నేప‌థ్యంలో ఒక్కో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ వ‌రంగ‌ల్‌లో ఏర్పాట‌వుతుంది. కేంద్రం క‌నుక హైద‌రాబాద్‌ను యూటీ చేస్తే తెలంగాణ‌కు వ‌రంగ‌ల్ రాజ‌ధాని అవ‌బోతోంది. అందుకు త‌గ్గట్లుగానే తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టినుంచే వ‌రంగ‌ల్ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. భూముల ధ‌ర‌లు కూడా ఏపీ, తెలంగాణ‌లో ఎక్క‌డా లేనంత ధ‌ర ప‌లుకుతున్నాయి. దీంతోపాటు రోడ్ల వెడ‌ల్పు, ఫ్లైఓవ‌ర్‌, ఇత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు నిధులు కూడా మంజూర‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: