దురాజ్‌ప‌ల్లిలో వింత ఘ‌ట‌న... ఏమి జ‌రిగిందో తెలుసా..?

N ANJANEYULU
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా బ‌తుక‌మ్మ పండుగ ఉత్స‌వాల‌ను అధికారికంగా జ‌రిపిస్తున్న విష‌యం విధిత‌మే. ఈ సంద‌ర్భంగా ఈనెల 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. తాజాగా సూర్య‌పేట జిల్లాలోని దురాజ్‌ప‌ల్లిలో ఓ వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అక్క‌డ బ‌తుక‌మ్మ ఆడుతున్న వ‌ద్ద‌కు ద‌ళిత మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ ఆడ‌కూడ‌ద‌ని.. అన‌డంతో  ఆ మ‌హిళ ఆవేద‌న‌కు గురైంది. ఇప్పుడు కూడా ఇంకా కుల‌వివ‌క్షనా అని చిన్న‌బోయింది.  ఇప్ప‌టికే ద‌ళితులు వెనుక‌బ‌డ్డార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ళితుల కోసం ద‌ళిత‌బంధు ప్ర‌వేశ‌పెట్టినా.. ఇంకా ఇలాంటి సంఘ‌ట‌నలు చోటు చేసుకోవ‌డం శోచ‌నీయం అని ద‌ళితులు పేర్కొంటున్నారు. చేసేది ఏమి లేక  చివ్వెంల పోలీస్ స్టేష‌న్‌లో ఆ మ‌హిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. అంద‌రూ క‌లిసి సుఖ‌, సంతోషాల‌తో  ఆట‌పాట‌ల‌తో ఆడాల్సిన బ‌తుక‌మ్మ వేడుక‌ల వ‌ద్ద కుల‌వివ‌క్ష చూపించ‌డం ఏమిట‌ని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: