బ్రేకింగ్: బద్వేల్ బరిలో బిజెపి అగ్ర నేత...?
ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఆయన సతీమణికి టికెట్ ఇవ్వటంతో పోటీ చేయబోమని జనసేన పార్టీ ప్రకటన చేసింది. జనసేన ప్రకటనతో సందిగ్ధంలో బిజెపి పడింది. ఈరోజు కడపలో బిజెపి ముఖ్యనేతల సమావేశం జరుగుతున్నది. ఇప్పటికే వైసిపి, టీడీపీ అభ్యర్థుల ప్రకటన కూడా జరిగింది. బిజెపి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది.