ఆన్ లైన్ లో జీవోల అంశం.. కోర్టు కీలక ఆదేశాలు!

Chaganti
ఆంధ్ర ప్రదేశ్ ఆన్ లైన్ లో  జీవోల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకునేందుకే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అందుకే ప్రభుత్వం జీవోలను ఆన్ లైన్ లో పెట్టడం లేదని న్యాయవాదులు వాదించారు, ప్రభుత్వం ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని వారు వాదించారు. అమెండ్  మెంట్ పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది సమయం కోరారు, అయితే తనకు ఎమండ్ చేసిన జీవో కాపీలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది, దీంతో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఇక కొన్ని జీవోలు ఆన్ లైన్ లో పెడుతున్నారు, కొన్ని జీవోలు పెట్టడం లేదు అంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే, చూడాలి మరి ఏమవుతుంది అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: