ప్లీజ్ గంజాయి పండిస్తా సార్..కలెక్టర్ కు రైతు లేఖ.. !

రైతులకు లాభాలు వచ్చాయి అనే వార్తలు తక్కువగా వినిపిస్తుంటాయి. ఎందుకంటే పంటల ద్వారా రైతులకు ఎప్పుడూ నష్టాలు వస్తూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఇతర కారణాల వల్ల రైతులు నష్టపోతూ ఉంటారు. మరోవైపు పండించిన పంటకు మద్దతు ధర లేక అప్పుల పాలవుతుంటారు. ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అవి తామరాకుపై నీటి బిందువు మాదిరిగానే మిగిలిపోతాయి. అలా వ్యవసాయంలో కష్టాలతో ఆవేదన చెందిన ఓ రైతు కలెక్టర్ కు లేఖ రాశాడు.


ఆ లేఖలో ఏ పంట పండించినా నష్టాలే మిగులుతున్నాయని.. పెట్టిన డబ్బులు తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తనకు గంజాయి పండించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కలెక్టర్ ను కోరారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర కు చెందిన ఓ రైతు అనిల్ పాటిల్ కలెక్టర్ కు రాసిన లేఖలో పంటకు మార్కెట్ లో ధర ఉండట్లేదు. కానీ మార్కెట్ లో గంజాయి కి మాత్రమే మంచి డిమాండ్ ఉంది. కాబట్టి దాన్ని సాగు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ సెప్టెంబర్ 15 లోపు తనకు రిప్లై ఇవ్వకపోతే అనుమతులు ఇచ్చినట్లు భావిస్తా అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: