వెకేషన్ మోడ్ ఆన్ : సిమ్లాకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన రోజువారీ కార్యకలాపాల నుంచి నాలుగురోజులు విశ్రాంతి తీసుకోవాలని భావించారు. ఈనెల 28వ తేదీన తన వివాహ వార్షికోత్సవం కూడా ఉండటంతో కుటుంబ సమేతంగా హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి కుటుంబ సభ్యలుతో బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి చండీఘడ్ వెళతారు. చండీఘడ్ నుంచి సిమ్లా చేరుకోనున్నారు. ఈనెల 31వ తేదీన తిరిగి జగన్ రాష్ట్రానికి రానున్నారు. తాను తిరిగి వచ్చేవరకు పరిపాలనలో ఎక్కడా అంతరాయం కలగకుండా అధికారులు బాధ్యతలు అప్పజెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్దిరోజులకు జెరూసలెం వెళ్లిన జగన్ ఆ తర్వాత విధినిర్వహణలోనే ఉండిపోయారు. మధ్యలో రెండుసార్లు విదేశీ ప్రయాణం చేశారు. దాదాపుగా ఆయన కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తూ వచ్చారు. కరోనా రెండోదశ ఉధృతి తగ్గుతుండటంతోపాటు వివాహ వార్షికోత్సవం కూడా ఉండటంతో ఆహ్లాదకరం కోసం సిమ్లా వెళుతున్నారని జగన్ సన్నిహిత వర్గాలు తెలిపారు.