ద‌ళిత‌బంధుకు నిధుల వ‌ర‌ద‌.!

Garikapati Rajesh


హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో రూ.500 కోట్లు విడుద‌ల చేసింది. హుజూరాబాద్ స‌భ అనంత‌రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే ఒక‌విడ‌త‌గా రూ.500 కోట్లు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు మొత్తంగా రూ.1000 కోట్లు విడుద‌ల‌య్యాయి. రూ.2వేల కోట్లు ప‌థ‌కానికి అవ‌స‌రం కానుండ‌గా మ‌రో రూ.వెయ్యి కోట్లు వారంరోజుల్లో విడుద‌ల చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఈ ప‌థ‌కం కింద హుజూరాబాద్ లోని ద‌ళితుల‌క ఒక్కో కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల చొప్పున అందించ‌నున్నారు. వారి ఆర్థిక స్థితిగ‌తులు అంచ‌నా వేసి, ఆ రూ.10 ల‌క్ష‌ల‌తో వారు ఎటువంటి వ్యాపారం చేస్తారు? ఎలా అభివృద్ధి చెందుతారు? త‌దిత‌ర ప్ర‌ణాళిక‌ల‌న్నింటినీ ప్ర‌భుత్వ శాఖ‌లు త‌యారుచేశాయి. సంవ‌త్స‌రంలోగా ఆ రూ.10 ల‌క్ష‌ల‌తో మ‌రో రూ.10 ల‌క్ష‌లు సంపాదించాల‌నేది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఉన్న ద‌ళితుల‌కు కూడా వీటిని అంద‌జేస్తామ‌ని, కాకపోతే చివ‌రి విడ‌త‌లో అంద‌జేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: