ఇటీవల సీఎం జగన్ కూతురు పై ఓ మహిళా టిడిపి కార్యకర్త నిరాధార ఆరోపణలు చేశారు. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడిన మాటలు ఎంతో ప్రభావం చూపించాయి. కాగా తాజాగా ఆ టిడిపి మహిళా కార్యకర్త ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కూతురిపై ఆరోపణలు చేసిన కారణంగా ఆమెపై సిఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం సి ఐ డి ఆఫీస్ కు తరలించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమే సదరు మహిళ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. సీఎం కూతురు వివాహం విషయమై మహిళ పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షం లో ఉంటే పార్టీ పరంగా విమర్శలు చేయాలి కానీ సంబంధం లేకుండా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం తో మహిళ చిక్కుల్లో పడింది. పాపులారిటీ కోసం పాకులాడి ఇప్పుడు జైలు పాలయ్యే వరకు తెచ్చుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.