దళితవాడలో రైతు భరోసా కేంద్రం మరియు హెల్త్ సెంటర్ ఏర్పాటు నిలిపివేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దళితవాడలో నిర్మించాలని వచ్చిన రైతు భరోసాకేంద్రాన్ని మరియు హెల్త్ సెంటర్ లను అధికారులు అగ్రవర్ణ ప్రాంతంలో నిర్మించడం మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా తిరుమూరు గ్రామంలో ప్రభుత్వ భవనాలు దళిత వాడలో ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని కుంచెం చినవెంకట రమణయ్య హైకోర్టును ఆశ్రయించారు.
కాగా దళిత వాడ కాబట్టే ప్రభుత్వ భవనాలను నిర్మించడం లేదని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు.
హైకోర్టులో విచారణకు రాగానే యుద్ధప్రాతిపదికన అగ్రవర్ణ ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు నిర్మించడాన్ని నిలిపివేశారు. దళిత వాడలోనే ప్రభుత్వ భవనాలను కడతామని ప్రభుత్వం పేర్కొంది. పిటిషనర్ తరుపు వాదనలను న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వినిపించారు. ఇక ఈ తీర్పుతో భవనాలను అగ్రవర్ణ ప్రాంతంలో కాకుండా దళితవాడలోనే నిర్మించనున్నారు.