వైసీపీ సోషల్ మీడియా హెడ్ కు సీబీఐ పిలుపు!

Chaganti
న్యాయమూర్తులను, న్యాయ వ్యవస్థలను దూషించిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసును ముందు పోలీసులకు అప్పగించగా వారు సీరియస్ గా తీసుకోలేదు.దీంతో కేసును సిఐడీకి అప్పగించారు. అయినా వారు కూడా ఏమీ తేల్చకపోవడంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈకేసులోనే విచారణకు రావాలని వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వైసీపీలో సోషల్ మీడియాకు సంబంధించి యాక్టివ్గా ఉండే వారందరికీ కూడా సీబీఐ నోటీసులు పంపింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరినీ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోగా వారికి 14 రోజుల రిమాండ్ కూడా కోర్టు విధించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఒక కార్యకర్తని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహ్రంలోనే దేవేందర్ రెడ్డికి పిలుపు వచ్చిందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: