నేను ఏ పార్టీలో లేను..ఇదే నా పార్టీ : జేడీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం రాచపల్లిలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్న ఆయన భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. లక్ష్మీనారాయణ ఏరువాక పున్నమి రోజు వ్యవసాయం ప్రారంభించారు. జేడీ లక్ష్మీ నారాయణ తోపాటు పలువురు రైతులు, వ్యవసాయ నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఏ పార్టీలో లేనని అన్నారు. కానీ రైతుల పార్టీలో ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్తులో ధర్మవరం గ్రామాన్ని వ్యవసాయ ప్రయోగాత్మక కేంద్రంగా మారుస్తారని లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇదిలా ఉండగా  లక్ష్మీ నారాయణ రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నుండి ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక రాజకీయాల్లో రానించలేకపోయినా ఇప్పుడు ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ క్షేత్రంలోకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: