ప్రపంచం అంతా ఒక మహమ్మారికి దండం పెడుతోంది. అదొక పీడకల అని మరిచిపోలేకపోతోంది..ప్రపంచం అంతా చావు గీతాలను విని కన్నీటి పర్యంతం అయింది. ఆ విధంగా ఓడిపోయిన మనిషి ఏవిధంగా అయినా గెలుస్తాడన్న నమ్మకం మళ్లీ ఇలాంటి విజయా లను చదివే అవకాశం ఉన్నప్పుడో దక్కినప్పుడో కలుగుతుంది. అలాంటి నమ్మకాలను స్థిరం చేసే వారిని మీరు ప్రేమించాలి.. కరో నా తరువాత కోలుకున్న ఓ స్విమ్మర్ తానేంటో నిరూపించాడు. కరోనా కారణంగా తీవ్ర శ్వాస సంబంధ సమస్యలతో సతమతమ యి,కోలుకున్నాక తన అజేయ శక్తిని నిరూపించాడు. తనకు ఎదురేలేదని పసిడి పతకాన్ని ముద్దాడి ప్రపంచానికో ఆత్మ విశ్వాస ప్ర కటన చేశాడు. ఆయన పేరు టామ్ డీన్... బ్రిటీష్ స్విమ్మర్..ఒలంపిక్స్ లో విజేత.
మనం అంతా ఓడిపోయి,నిరాశ పడి చావును పలకరించి వచ్చిన వాళ్లను చూశాం. నాలుగు నెలల్లో రెండు సార్లు కరోనా బారిన పడి చావు అంచుల దాకా వచ్చిన వారి గురించి ఇప్పుడు పదే పదే వింటాం. చావు పరిహాసం అని అంటారే అలాంటిదే ఈ కరోనా మిగి ల్చిపోయిన సందర్భంలో ఆ స్విమ్మర్ ఆత్మ విశ్వాసానికి మరో నిర్వచనం అయ్యాడు. టోక్యో ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని ముద్దాడి బంగారు కలలను సాకారం చేసుకున్నాడు. ఇప్పుడయినా ఒప్పుకోండి..పాడుకోండి మానవుడే మహానీయుడు..అని!