దేశాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు, ఆర్మీకి కొత్త శిక్షణ...?
అదే తరహాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి దేశ రాజధానిపై దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దీనితో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగడం అలాగే త్వరలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపధ్యంలో పాక్ ఉగ్రమూకలు కీలక ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విద్రోహ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తొలిసారిగా శిక్షణ ఇవ్వడం గమనార్హం.