ఉత్తర ప్రదేశ్ లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో తెలుగు మహిళ సత్తా చాటింది. జాన్పూర్ నియోజకవర్గానికి జెడ్పి చైర్ పర్సన్ గా శ్రీకళారెడ్డి ఎన్నికైంది. శ్రీకళారెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్రెడ్డి కుమార్తె కావడం విశేషం. జితేందర్ రెడ్డి స్థానికంగా ప్రజా సేవ చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీకళా రెడ్డి యూపీ పరిషత్ ఎన్నికల్లో అధికార జనతా పార్టీ తరపున ఎన్నికల్లో భరిలోకి దిగి విజయం సాధించింది.
అంతే కాకుండా జెడ్పి చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం యూపీలో తెలుగు మహిళ సత్తా చాటడం నెట్టింట హల్ చల్ చేస్తోంది. యూపీలో శ్రీకళారెడ్డి గెలవడం పై సూర్యాపేట జిల్లా వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా యూపీలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో బిజెపి విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోడీ సైతం స్పందించారు. యోగీ పాలనను కొనియాడారు