
నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. టైమ్ ఇదే.. !
పరీక్ష ఫీజు కట్టిన ప్రతి ఒక్కరినీ పాస్ చేస్తున్నట్టు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో గత ఏడాది కూడా ఈ విధంగానే ఈ పరీక్షలు రద్దయ్యాయి. దాంతో విద్యార్థులందరినీ పాస్ చేశారు. ఇక ఈసారి కూడా కరోనా ప్రభావం తగ్గకపోవడం తో పరీక్షలు రద్దు చేసి పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంటర్ తర్వాత విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబి బిఎస్ చేయాలంటే ఎంసెట్ రాయాల్సి ఉంటుంది. అయితే ఎంసెట్ పరీక్షలు మాత్రం ప్రభుత్వం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.