పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు ఒక్క రోజు కూడా పైసా తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 దాటేసింది. దాంతో నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. అయితే పెరిగిన ధరలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే చాన్స్ కనిపించడం లేదు. అంతేకాకుండా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో టాక్సీ,ఆటోడ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా మరోసారి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెట్రోల్ పైన 36 పైసలు, డీజిల్ పై 26 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ఇంకా 102.32 గా ఉండగా లీటర్ డీజిల్ ధర, 96.89 కు చేరింది. లాక్ డౌన్ నుండి అంటే దాదాపు 15 నెలల నుండి పెట్రోల్ ధరలు దారుణంగా పెరిగాయి. జనవరిలో లీటర్ పెట్రోల్ 80 రూపాయలు ఉండగా ఇప్పుడు 100 దాటింది. లీటర్ డీజిల్ 75 ఉండగా అది కూడా 100కు చేరువయ్యింది.