పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భారంలా మారాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల అన్ని నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు ధరలను పరిశీలిస్తే...దేశరాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర లీటర్ కు రూ. 96.93గా ఉంది. డీజిల్ ధర రూ. 87.69 గా ఉంది. బోపాల్ లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీని క్రాస్ చేసింది. ఈ రోజు బోపాల్ లో పెట్రోల్ లీటర్ ధర. 104.53 గా ఉండగా...డీజిల్ ధర లీటర్ కు రూ. 95.75 గా ఉంది. అంతే కాకుండా ముంబైలోనూ పెట్రోల్ లీటర్ ధర సెంచరీని బీట్ చేసింది. తాజా ధరలు చూస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82 మరియు డీజిల్ ధర లీటర్ కు రూ. 94.84 గా ఉంది.