రాజీనామాకు మూహుర్తం ఫిక్స్ చేసిన ఈట‌ల‌

N.V.Prasd
మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు మూహుర్తం ఖ‌రారు చేశారు. రేపు ఉద‌యం 11గంట‌ల‌కు ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు.రాజీనామాకు ముందు గ‌న్‌పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల స్థూపానికి ఈట‌ల రాజేంద‌ర్ నివాళ్లు అర్పించ‌నున్నారు.అనంత‌రం అసెంబ్లీలోని స్పీక‌ర్ కార్యాల‌యంకి వెళ్లి రాజీనామా ప‌త్రాన్ని అందించ‌నున్నారు. ఈ నెల 14న భార‌తీయ జ‌న‌తాపార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌నున్నారు .ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకుఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్గీయులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్మ‌న్ తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేర‌నున్నారు.అయితే ఇప్ప‌టికే రాష్ట్ర బీజేపీ నేత‌లు ఈట‌ల రాజేంద‌ర్ రాక‌ను స్వాగ‌తిస్తున్నారు.హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీ చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: