ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూటిక్‌ను ట్విట్టర్ పునరుద్దరించింది. బ్లూ టిక్‌ను తొలిగించిన కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని పునరుద్దరణ చేసింది.ట్విట్టర్ లాగిన్లో చాలా గ్యాప్ కారణంగా ఇది జరిగిందని తెలిపింది.వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ చాలా కాలం నుంచి వాడుకలో లేదని...గత ఏడాది జులై 23న ఆయన తన ట్విట్టర్ నుంచి చివరి ట్వీట్ చేశారు. వాడుకలో లేకపోవడం వల్ల ట్విట్టర్ అల్గారిథం బ్లూ బ్యాడ్జ్‌ని తొలిగించిందని ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ అధికారులు తెలిపారు.