తెలంగాణలో ప్రస్తుతం సూరర్ స్ప్రైడర్ లకు కరోనా వ్యాక్సిన్ లు వేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మందిని సూపర్ స్ప్రైడర్లుగా గుర్తించి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆటోడ్రైవర్లు, కూరగాయల వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, జర్నలిస్ట్ లు మరి కొంత మందిని సూపర్ స్ప్రైడర్లుగా గుర్తించారు. మొదట కరోనా బారిన పడే ప్రమాదం ఉన్నందున సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కూడా ముందుగా వ్యాక్సిన్ లు వేయాలని నిర్నయం తీసుకుంది. త్వరలో వాళ్ల చదువులకోసం వెళ్లాల్సి ఉంది కావున వారికి వ్యాక్సిన్ లు వేయాలని నిర్నయించింది. అంతే కాకుండా తమ దేశానికి రావాలంటే టీకా వేసుకోవడం తప్పనిసరని కూడా కొన్ని దేశాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో కూడా విదేశాలకు వెళ్లే వారికి టీకా విషయంలో మొదటి ప్రాధాన్యాత ఇస్తామని వైద్యారోగ్యశాక ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.