ప్రధాన మంత్రితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు: మమత

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో కయ్యానికి కాలు దువ్వె పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆమె ఏది మాట్లాడినా సరే కాస్త సంచలనంగానే ఉంటుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో తుఫాన్ రాగా కేంద్రం నుంచి సరైన సహాయం రాలేదని మమత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూసాం. ఇక ఒడిశా ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే కేంద్రం సాయం చేసిందని ఆమె మండిపడ్డారు.

ఇక ఇప్పుడు మరోసారి కేంద్రంపై ఆమె నిప్పులు చెరిగారు. తాను  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సమయంలో మోడీ నుంచి మీటింగ్ అని సమాచారం వచ్చిందని అందుకే తాను మాట్లాడలేకపోయా అని చెప్పారు. మోడీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేసారు. అనవసరంగా దీనిపై రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: