కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయినా నిత్యం ఎంతో మంది నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం నిబంధనలు లెక్కచేయకుండా అనవసరంగా బయటికి వచ్చిన వారితో అక్కడి పోలీసులు రామనామం రాయిస్తున్నారు. ఉల్లంఘనుల చేతికి ఒక డెయిరీ ఇచ్చి పేజీ నిండా రామ రామ అని రాయమంటున్నారు.