న‌ల్ల‌గొండ‌లో కారుకు మాజీ ఎమ్మెల్యే షాక్‌

VUYYURU SUBHASH
నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఇక్క‌డ కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మున్సిపాల్టీలో మొత్తం 20 వార్డులకు టీఆర్‌ఎస్‌ 11 గెల్చుకోగా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుదారులు (ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీచేసి) ఆరుగురు విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్‌ ఒకరు గెలుపొందారు. ఇండిపెండెంట్‌ అభ్యర్ధి కందాల భిక్షంరెడ్డి టీఆర్‌ఎస్‌ క్యాంపులోకి వెళ్లిపోవడంతో చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌కే దక్కనుంది. ఏదేమైనా వీరేశం వ‌ర్గం ఇక్క‌డ ఏకంగా ఆరు కౌన్సెల‌ర్ సీట్లు గెలుచుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: