ఏపీలో అక్క‌డ ఎండ‌లు మండుతున్నాయ్‌... ఇంత ఉష్ణోగ్ర‌తా..!

VUYYURU SUBHASH
మే నెల ప్రారంభం కాకుండానే ఏపీలో ఎండ‌లు మండిపోతున్నాయి. ఏపీలో రాయలసీమలో ఎండల తీవ్రత కొనసాగింది. గురువారం ఆళ్లగడ్డ, తాడిపత్రి, కొండాపురంలో 41.3-41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డుతుంటే సీమ‌లో మాత్రం ఎండ‌లు ఠారెత్తి పోతున్నాయి. రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 35-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ‌ పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: