జ‌గ‌న్ కీల‌క డెసిష‌న్‌... నెల రోజులే టార్గెట్‌

VUYYURU SUBHASH
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా రెండో ద‌శ‌లో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ నెల రోజుల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్ ను అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని జగన్ ఆదేశించారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ ఎలా వేయాలో కూడా జ‌గ‌న్ అధికారుల‌కు చెప్పారు. గ్రామ ప్రాంతాల్లో ప్ర‌తి మండ‌లంలో వారానికి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేష‌న్ అందించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. రోజుకు రెండు గ్రామాల్లో పర్యటించి వ్యాక్సినేషన్ ఇవ్వాలని జగన్ తెలిపారు. కరోనా శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుండ‌డంతో వ్యాక్సిన్ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌ద్ద‌ని కూడా జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: