మూడో 20లో భార‌త్‌పై గెలుపుతో ఇంగ్లండ్ స‌రికొత్త రికార్డు

VUYYURU SUBHASH
ఇంగ్లండ్ - ఇండియా మ‌ధ్య గత రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విజయం ఇంగ్లండ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్లో భారత్ పై 99వది. భారత్ పై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది.
వ‌న్డే క్రికెట్‌, టీ 20, టెస్ట్ మ్యాచ్‌ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ జ‌ట్టుపై ఇంగ్లండ్ 99 విజ‌యాలు న‌మోదు చేసింది. మ‌రో మ్యాచ్ గెలిస్తే భార‌త్‌పై ఆ జ‌ట్టుకు 100వ విజ‌యం అవుతుంది. ఇక భార‌త్‌పై అన్ని ఫార్మాట్ల‌లో విండీస్ కూడా 99 విజ‌యాలు సాధించి రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆసీస్ జట్టు భారత్ పై ఇప్పటివరకు 132 విజయాలు నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: