టీడీపీకి జూనియ‌ర్ ఎన్టీఆరే గ‌తి... ఏపీ మంత్రి సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌

VUYYURU SUBHASH
ఏపీలో పుర‌పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో విప‌క్ష పార్టీల‌తో పాటు స్వ‌ప‌క్షంలోనూ ప‌లువురు నేత‌లు పార్టీని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగుదేశం పార్టీపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని... కార్పొరేష‌న్‌; మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని బాలినేని చెప్పారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం నిల‌దొక్కు కోవాలంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక్క‌రే గ‌తి అని మంత్రి అన్నారు. విజయవాడ, గుంటూరు ప్రజలు కూడా రాజధాని అమరావతిని తిరస్కరిచారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: