పంచాయతీ పోరు: అక్కడ నిలిచిపోయిన ఎన్నికలు.. కారణం ఇదే..!!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 6గంటల 30నిమిషాలకి మొదలైంది. ఏపీ లో మొత్తంగా 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. వీటిలో 579 ఏక గ్రీవాలు అయ్యాయి. నేడు 2640 సర్పంచ్.. 19,607 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో విశాఖలోని పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టి వారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఈ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: