తిరుమల వెళ్తున్న వారు ఇది తెలుసుకోవాల్సిందే

కరోనా తీవ్రత ఉన్నా సరే తిరుమలలో భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా టీటీడీ నిలిపివేస్తున్నది. ఇప్పటికే 24వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేసిన టీటీడీ... డిసెంబర్ 24 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని స్థానికులకు మాత్రమే టోకెన్లను జారీ చేస్తామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

నేటి నుంచి జనవరి 3వ తేదీ వరకు శ్రీవారి దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. కరోనా నిబంధనలు నేపథ్యంలో దర్శన టిక్కెట్లు లేని భక్తులు తమ ప్రయాణం వాయిదా వేసుకోవాలని  భక్తులకు టీటీడీ వాయిదా విజ్ఞప్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: