జగన్ గారూ ప్రయోగాలు ఆపండి సార్...!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. కరోనా విపత్తు నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించండి అని ఆయన కోరారు. ఏపీలో 9, 10 తరగతులకు స్కూళ్లు తెరిచి 3 రోజులు కాకముందే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా సోకటం శోచనీయం అన్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 150 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకింది అని ఆయన పేర్కొన్నారు.

నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పలువురు టీచర్లు, స్టూడెంట్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు అని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పాఠశాల ప్రారంభం పెను విపత్తుకు దారితీస్తుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పైగా విద్యార్థుల పూర్తి ఆరోగ్య బాధ్యత తల్లిదండ్రులదే అన్నట్లు రాతపూర్వక లేఖలు తీసుకోవటం తగదు అని అన్నారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేయడం మానుకోండని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: