మరో మారు భారత్- చైనా చర్చలు.. ఎక్కడ అంటే..!

Lokesh
భారత్​-చైనా మధ్య 8వ దఫా కార్ప్స్​ కమాండర్ స్థాయి చర్చలు ఈ వారంలో జరగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణే లక్ష్యంగా ఇరు దేశాలు చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.రెండు దేశాలకు ఈ దఫా చర్చలు అత్యంత ముఖ్యమైనవి. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలతో పాటు ఉద్రిక్తతలు నెలకొన్న ఇతర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముండటమే ఇందుకు కారణం.

8వ విడత కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చల్లో భారత్​ తరఫున 14 కార్ప్స్​ కమాండర్​ లెఫ్టి​నెంట్​ జనరల్​ పీజీకే మీనన్ నేతృత్వం వహించనున్నారు. నాలుగు నెలలుగా భారత్​, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. పాంగాంగ్​ సరస్సులోని కీలకమైన స్థావరాలపై భారత్​ పట్టు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: