బ్రేకింగ్ : కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ ఆకస్మిక మృతి

Chakravarthi Kalyan

విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే  జనార్ధన్ థాట్రాజ్ ఆకస్మికంగా  కన్నుమూశారు. జనార్ధన్ థాట్రాజ్ గుండె పోటుతో విశాఖపట్నం లో చికిత్స పొందుతూ మృతి చెందారు. థాట్రాజ్‌ టీడీపీ నేత.. ఆయన 2019 ఎన్నికల్లో లో టిడిపి తరుపున కురుపాంలో నామినేషన్ వేశారు. 

 


అయతే అనూహ్యంగా  థాట్రాజ్ కుల వివాదం కారణంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ఎస్టీ అని చెప్పే ధ్రువీకరణ పత్రాలు సరికాదని ఈసీ భావించడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. జనార్దన్ నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. 2013నాటి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఎలా తీసుకున్నారంటూ ఎన్నికల అధికారిని ప్రశ్నించారు. 

 


అలాగే జనార్దన్ ఎస్టీ కాదంటూ హైకోర్టు, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన కాపీలను అందజేశారు. ఎన్నికల అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు.అయితే... టీడీపీ ముందస్తు జాగ్రత్తగా జనార్దన్ థాట్రాజ్ తల్లి నరసింహ ప్రియా థాట్రాజ్‌‌తో నామినేషన్ వేయించారు. ఈ నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు. జనార్థన్ థాట్రాజ్‌ సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజుకు  మేనల్లుడు అవుతారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: