కరోనా ను జయించిన పోలీసు అధికారులకు ఘన స్వాగతం పలికిన డీజీపీ గౌతమ్ సవాంగ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. కేవలం సామాన్య ప్రజలే కాదు.. అధికారులు నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలవుతున్నారు . అయితే ప్రజలకు రక్షణ కల్పిస్తున్న ఎంతో మంది పోలీసు అధికారులు సైతం కరోనా వ్యాధి బారిన పడుతున్నారు.
అయితే ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన ఐపీఎస్ దంపతులు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని కరోనా వైరస్ కోలుకున్నారు. కరోనా వైరస్ ను జయించిన వారు తిరిగి ఈరోజు విధుల్లో చేరారు. దిశా స్పెషలాఫీసర్ దీపికా పటేల్, డిసిపి విక్రాంత్ పాటిల్ దంపతులకు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరారు. కాగా తిరిగి విధుల్లో చేరిన ఐపీఎస్ దంపతులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘనస్వాగతం పలికారు.