తెలంగాణ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా..?

praveen
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్ షాప్ నుండి గంగుల కమలాకర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పిన ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ఈ ఎస్కార్ట్ వాహనంలో ప్రయాణిస్తున్న కొత్తపల్లి ఎస్ఐకి తీవ్రగాయాలయ్యాయి. ఘటనలో కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ చేతి బొటన వేలు తెగి పడిపోయింది.

 దీంతో ఎస్సై ఎల్లా గౌడ్ ను  హుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనలో డ్రైవర్ కి కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: