నేడే వైయస్సార్ 71వ జయంతి... సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమాలేవే....?

Reddy P Rajasekhar

నేడు దివంగత నేత, స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ పుట్టినరోజు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సాదాసీదాగా వైయస్సార్ పుట్టినరోజు కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం జగన్ ఈరోజు ఉదయం 8.10 గంటలకు కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాప్రతినిధులతో కలిసి వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించనున్నారు. నేడు సీఎం జగన్ అర్కే వ్యాలీ టిపుల్ ఐటీలోని ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ భవనాలను ప్రారంభిస్తారు. 
 
రెస్కో కోలబ్రేషన్ సిస్టమ్ తో నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంట్ కు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. 10 కోట్ల రూపాయలతో ట్రిపుల్ ఐటీలో నిర్మించిన కంప్యూటర్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏకకాలంలో 2,500 మంది విద్యార్థులు పట్టే వైయస్సార్ ఆడిటోరియంకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: