పాకిస్థాన్​కి కరోనాపై పోరులో మరో ఎదురు దెబ్బ 48 మంది డాక్టర్లు రాజీనామా..!

Lokesh

 

కరోనాపై పోరులో పాకిస్థాన్​ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైరస్​ను కట్టడి చేయటంలో ముందుడే వైద్యులకే సరైన రక్షణ కల్పించటం లేదనే కారణంతో పంజాబ్​ రాష్ట్రంలోని బోధనా ఆస్పత్రులకు చెందిన 48 మంది డాక్టర్లు రాజీనామా చేశారు.48 మంది యువ వైద్యుల రాజీనామాలు ఆమోదించినట్లు నోటిఫికేషన్​ జారీ చేసింది పంజాబ్​ ఆరోగ్య శాఖ.ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే మరింత మంది వైద్యులు రాజీనామా చేస్తారని హెచ్చరించారు.

 

అయితే.. ప్రభుత్వం వైద్యులకు, సిబ్బందికి అన్ని రకాల భద్రత కిట్లు అందించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. యాస్మిన్​ రషీద్​ తెలిపారు.పాకిస్థాన్​లో ఇప్పటి వరకు 5,000 మంది ఆరోగ్య నిపుణులు వైరస్​ బారిన పడ్డారు. అందులో 3వేల మంది డాక్టర్లు, 600 మంది నర్సులు ఉన్నారు. మొత్తం 70 మంది వైద్యులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అందులో 35 మంది వైద్యులు పంజాబ్​ వారే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: