బ్రేకింగ్ : పది, ఇంటర్ టాపర్లకు యూపీ సర్కార్ బంపర్ ఆఫర్....?
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తాజాగా విడుదలైన పది, ఇంటర్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు లక్ష రూపాయల బహుమానం అందజేస్తామని.... నగదుతో పాటు ల్యాప్ టాప్ కూడా ఇస్తామని ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రోడ్డు సౌకర్యం లేని టాపర్ల ఇంటి వరకు రోడ్డు నిర్మించబోతున్నట్లు మరో కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.