328 ఏళ్ల సాంప్రదాయానికి బ్రేక్...!

కరోనా వైరస్ దెబ్బ దేవాలయాలకు భక్తులకు కూడా భారీగానే తగిలింది. దేశ వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ఇప్పుడు కరోనాను దృష్టి లో పెట్టుకునే ఏ కార్యక్రమాలు అయినా సరే చేసే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్‌ లోని  328 ఏళ్ల జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర సంప్ర‌దాయానికి కరోనా దెబ్బకు బ్రేక్  పడింది  . రాంచీలోని జగన్నాథ‌ ఆలయ రథయాత్ర విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

 

కరోనా నేపధ్యంలో భక్తులకు స్వామి వారి దర్శనం ఉండదు అని అధికారులు స్పష్టం చేసారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. రాంచీలోని జగన్నాథ్‌పూర్‌లో 1691 సంవత్సరం నుంచి ఈ యాత్ర జరుగుతుంది. ఆలయం లోపల మాత్రమే పూజారులు రధయాత్ర యాత్ర నిర్వహిస్తారు. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు హాజరు కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: