వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్....? వాస్తవమేనా...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ సామాన్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులకు సైతం సోకుతూ భయాందోళనకు గురి చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. తాజాగా ఏపీలోని ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ అయినట్లు ఎవరూ ధ్రువీకరించలేదు. 
 
విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబొండ శ్రీనివాసరావుకు కరోనా సోకినట్టు లోకల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈయన కొన్నిరోజుల క్రితం అమెరికాకు వెళ్లి వచ్చారు. అనంతరం కొన్ని రోజులు హోం క్వారంటైన్ లో ఉండి పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్టు స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే స్పందిస్తే మాత్రమే ఈ వార్త నిజమో కాదో తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: