లడఖ్ పరిస్థితులపై రాజ్‌నాథ్ సమీక్ష... సైన్యానికి పూర్తి స్వేచ్ఛ...?

Reddy P Rajasekhar

భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తూర్పు లడఖ్ లో నెలకొన్న పరిస్థితుల గురించి తాజాగా సమీక్ష నిర్వహించారు. భారత త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్‌ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని రాజ్ నాథ్ వాళ్లకు సూచించారు. 
 
జల, వాయు, భూమార్గాల ద్వారా చైనా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని... డ్రాగన్ ఎలాంతి దుశ్చర్యలకు పాల్పడినా డ్రాగన్ ఎలాంటి దుశ్చర్యలకు ప్రయత్నించినా ధీటుగా బదులివ్వాలని చెప్పారు. వాస్తవాధీన రేఖ వెంబడి మరింత అప్రమత్తంగా ఉండి చైనా ఆర్మీ దురాక్రమణలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ఆదేశాలు ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: