షాక్.. జగిత్యాలలో చిరుత కలకలం!
ఈ మద్య తెలంగాణలో కరోనాతోనే నానా బాధలు పడుతున్నాం రా బాబో అంటే.. చిరుతల సంచారాంలో మరింత భయాంతోళనకు గురి అవుతున్నారు ప్రజలు. ఇది చాలదన్నట్లు పాక్ నుంచి దండుగా వచ్చిన మిడతలు తెలంగాణలో కూడా దాడులు చేస్తున్నాయి. తెలంగాణలో వరుసగా చిరుతలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జిగిత్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత కోసం గాలిస్తున్న అటవీ అధికారులు చిరుత అడుగులను గుర్తించారు. అయితే చిరుతను చూశామని స్థానికులు చెబుతున్నారు. దీంతో పట్టణంలో చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు.
ఆ మద్య హైదరాబాద్ లో చిరుత కనిపించినట్టే కనిపించి తప్పించుకుంది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల సమీపంలో గోపాలదీన్నే రిజర్వాయర్ వద్ద చిరుత ఆనవాళ్లు స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుంది. సిద్దిపేట సమీపంలో చిరుత సంచారం. చిరుత అడుగులను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు.
హైదరాబాద్ పరిసరప్రాంతంలో, గనగ్పాడ్, ఆదిలాబాద్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో చిరుత సంచారం కొద్ది రోజులుగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇలా వరుసగా చిరుతల సంచారంతో ఓ వైపు అటవీశాఖ వారికి కంటిమీద కునుకు లేకుండా వాటిని వెతికే పనిలో పడ్డారు.