అచ్చెన్న అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబు పరిస్థితేమిటో... విజయసాయి తీవ్ర విమర్శలు....?
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ లపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబు నాయుడుకు తాజా లెక్కలు చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి వైయస్ జగన్ సర్కార్ ఎంత కట్టుబడి ఉందో తెలుస్తుందని అన్నారు. కులాలను రెచ్చగొట్టి, ఆ హింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదేనని అన్నారు.
బడ్జెట్లో కేటాయింపులలో బీసీలకు 68.18%, కాపులకు 42.35%, మైనార్టీలకు 116% జగన్ సర్కార్ పెంచిందని అన్నారు. మరో ట్వీట్లో ఈ.ఎస్.ఐ మాజీ డైరెక్టర్లు అచ్చెన్న బెదిరింపుల వల్లే రూల్స్ కు విరుద్ధంగా కొనుగోలు చేసామని చెప్పారని..... వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్ సైడ్ స్టోరీలు బయట పెట్టారని.... వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదని.... అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో? అని ట్వీట్ చేశారు.
ప్రతి దానికి కులానికి లింకుపెట్టే @ncbn ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. bc,SC,ST,మైనార్టీల సంక్షేమానికి కట్టుబడ్డది @ysjagan గారి ప్రభుత్వమని. కులాలను రెచ్చగొట్టి,ఆహింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే!బడ్జెట్లో కేటాయింపులలో బీసీలకు 68.18%, కాపులకు 42.35%,మైనార్టీలకు 116%పెంపు. — Vijayasai reddy v (@VSReddy_MP) June 17, 2020
ESI మాజీ డైరెక్టర్లు అచ్చెన్న బెదిరింపుల వల్లే రూల్స్ కు విరుద్ధంగా కొనుగోలు చేసామని చెప్పారంట. వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్ సైడ్ స్టోరీలు బయట పెట్టారంట. వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు. అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో? — Vijayasai reddy v (@VSReddy_MP) June 17, 2020