బ్రేకింగ్ : రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త.... పది రోజుల్లో రైతుబంధు....?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. నియంత్రిత పద్ధతిలో పంటసాగు చేయడానికి సిద్ధపడిన రైతులకు సీఎం అభినందనలు తెలిపారు. ఈరోజు సీఎం కేసీఆర్ నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాల గురించి ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితి గురించి సీఎం సమీక్ష జరిపారు. 
 
సీఎం కేసీఆర్ రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించిందని... నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం హర్షణీయమని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసమే నియంత్రిత సాగు విధానం ప్రతిపాదనలు జరిగాయని అన్నారు. రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వారం పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాలలో జమ చేయాలని చెప్పారు. వ్యవసాయ పనుల కోసం రైతుబంధు నగదును వినియోగించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: