ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భార్య సహా నలుగురికి కరోనా... ఏ ఒక్కరిలోను కనిపించని లక్షణాలు..?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం కరోనా భారీన పడుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో ఇంట్లోని వారందరికీ అధికారులు పరీక్షలు చేయగా నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే సతీమణి పద్మలతా రెడ్డితోపాటు ఎమ్మెల్యే డ్రైవర్, గన్ మెన్, వంట మనిషికి కరోనా నిర్ధారణ అయింది. 
 
పాజిటివ్ వచ్చిన నలుగురిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఎమ్మెల్యే సతీమణి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు. ఎమ్మెల్యే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.... ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని... వారం రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని ఆమె వాట్సాప్ సందేశం విడుదల చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: