కరోనాను జయించిన 97ఏళ్ల వృద్ధుడు
ఆగ్రాకు చెందిన 97ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్‌ను జయించాడు. 1923లో జన్మించిన అతడు.. కరోనా బారినపడి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి నుండి డిశ్చార్జ్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న వృద్ధులలో ఆయనొకరని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యులు చేశారు. ఇది చారిత్రాత్మక నగరానికి ఇది గర్వించదగిన విషయమని ప్రశంసించారు. కరోనాను జయించిన 97ఏళ్ల వృద్ధుడిని ఆశా కిరణంగా అభివర్ణించారు. కరోనాను జయిస్తామన్న నమ్మకం మరింతగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.