ఏపీ విద్యుత్ సంస్థలకు భారీ షాక్ ఇచ్చిన కరోనా.... ఏం జరిగిందంటే...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ వల్ల కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో దేశంలోని అన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బ తిన్నాయి. లాక్ డౌన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిస్కంలకు భారీ షాక్ తగిలింది. లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య సంస్థలు మూతబడటంతో 25 శాతం విద్యుత్ వినియోగం తగ్గింది. 
 
ఫలితంగా గత మూడు నెలల్లో రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ అమ్మకాలు తగ్గాయి. విద్యుత్ వినియోగం తగ్గినా ఉత్పత్తి సంస్థలకు ఫిక్స్ డ్ ఛార్జీలను డిస్కంలు చెల్లించాల్సి రావడంతో ఏపీ విద్యుత్ సంస్థలకు భారీ నష్టాలు వచ్చాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల డిస్కమ్ లు కోట్ల రూపాయల నష్టాలను చవిచూశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: