వీరిలో ‘కరోనా రత్న’ ఎవరో చెబుతారా? : విజయసాయి

Edari Rama Krishna

గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు మహా వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత ఎంపి విజయ సాయిరెడ్డి వర్సెస్ టీడీపీ, బిజెపి, జనసే నాయకుల మద్య పెద్ద ఎత్తున ట్విట్టర్ వార్ నడుస్తుంది.  ప్రస్తుత పరిస్థితులపై ప్రతిపక్షాలు పలు విమర్శలు చేస్తున్నారు. వాటికి ధీటుగా విజయసాయి రెడ్డి సైతం సమాధానాలు ఇస్తున్నారు.  తాజాగా మరోసారి వైసీపీ నేత విజయసాయి రెడ్డి పలువురు నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపిలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే...ఈ సమయంలో విశాఖలో విషాదం సంఘటన జరిగిన విషయం తలెిసిందే. 

 

ఇదే సందు అనుకొని ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. తాజాగా  వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ నేతలపై సెటైర్ల విసురుతున్నారు. కొంద‌రి నాయ‌కుల‌కు మార్లు పెడుతూ.. క్విజ్ నిర్వహించారు. ఐదుగురు నేతల పేర్లను సూచిస్తూ.. కరోనా రత్న ఎవరు అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

 

1. పెదనాయుడు 2. చిననాయుడు 3. మలమలకృష్ణరాముడు 4. దయనేని రమ 5. భజనా చౌ 24 గంటల్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి.. అంటూ సాయిరెడ్డి పైన ఐదు పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: