కార్పొరేట‌ర్‌కు క‌రోనా... అటు జైలు... ఇటు స‌స్పెన్ష‌న్‌.. రెండు గిఫ్ట్‌లు...!

VUYYURU SUBHASH

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా గురించి ప్ర‌జ‌లంద‌రికి అవ‌గాహ‌న క‌ల్పిస్తూ.. వారిని అప్ర‌మ‌త్తం చేయాల్సిన ఓ ప్ర‌జాప్ర‌తినిధే నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో పాటు త‌న సోద‌రుడికి క‌రోనా సోకింద‌న్న విష‌యాన్ని కూడా దాచిపెట్టారు. దీంతో పోలీసులు ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకుని తీవ్ర‌మైన కేసు న‌మోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ నుంచి కూడా అత‌డిపై స‌స్పెన్ష‌న్ చ‌ర్య‌లు తీసుకోనున్నారు.


  
ఈ ఘటన కశ్మీర్‌లో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ మాజిద్‌ షులూకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. స్థానికుల స‌మాచారంతో అత‌డి ఇంటికి చేరుకున్న పోలీసులు విచారించ‌గా అత‌డి సోద‌రుడు ఇటీవలే ఢిల్లీ నుంచి క‌శ్మీర్‌కు వ‌చ్చిన‌ట్టు తేలింది. కార్పొరేట‌ర్ సోద‌రుడు ఓ ట్ర‌క్కులో ర‌హ‌స్యంగా ఇండికి వ‌చ్చేశాడు. ఈ క్ర‌మంలోనే కార్పొరేట‌ర్ మాజిత్తో పాటు ఆయ‌న సోద‌రుడిపై కేసు న‌మోదు చేశారు.

 

కార్పొరేటర్‌కు కరోనా సోకినట్లు తేలడంతో ఎస్‌ఎంసీ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ మేయర్‌ జునైద్‌ మట్టు విజ్ఞప్తి చేశారు. ఇక కార్పొరేటర్‌ మాజిద్‌ను కలిసిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎస్‌ఎంసీ కమిషనర్‌ గజాన్‌ఫర్‌ అలీ సూచించారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు అత‌డిపై తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు రెడీ అవుతుండ‌గా... అత‌డిని పార్టీ నుంచి స‌ప్పెండ్ చేయాల‌న్న డిమాండ్లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: