సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం... ఆ మూడు ప్రాంతాలలో మరింత కఠినంగా లాక్ డౌన్...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనానును నియంత్రించగలమని అన్నారు. మొదటి నుంచి కరోనా విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. రెడ్ జోన్లలో ఉన్న హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలని ఈ మూడు జిల్లాల విషయంలో ఎటువంటి సడలింపులు ఇచ్చే ప్రసక్తి లేదని అన్నారు. 
 
ఈ మూడు జిల్లాలలోనే 726 కేసులు, 25 మరణాలు సంభవించాయని... ఈ ప్రాంతాల నుంచే కేసులు నమోదవుతున్నాయని అన్నారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లో కేసులు నమోదు కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు 11 కేసులు నమోదయ్యాయని... కేసుల సంఖ్య 1096కు చేరిందని అన్నారు. మూడు జిల్లాలలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ప్రజలు సహకరించాలని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: