విశాఖలో విజృంభిస్తున్న కరోనా.... జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...?

Reddy P Rajasekhar

విశాఖలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ జిల్లాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జిల్లాలో ఒకే ప్రాంతంలో ఒకే ఇంట్లో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మరో రెండు శాంపిళ్లకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. తాజాగా కిడ్నీ వ్యాధితో చనిపోయిన ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కేంద్రం విశాఖను ఆరెంజ్ జోన్ గా ప్రకటించింది. 
 
ఆరెంజ్ జోన్ ప్రాంతాలలో కేసులు నమోదవుతూ ఉండటంతో జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో నిబంధనలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఒకే ఇంట్లో రెండు కేసులు నమోదు కావడంతో పోలీసులు కేసులు నమోదైన ఏరియాలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా సోకిన ఇద్దరికీ ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోయినా వైరస్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. జిల్లాలో నిన్న రెండు కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 25కు చేరింది. ఈరోజు నమోదైన కేసుల వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: